ముంబయి: డెలీవరీ ఏజెంట్‌లా ఓ వ్యక్తి అపార్టుమెంటులోని ఓ ప్లాటులోకి చొరబడి ఐటి ఉద్యోగురాలిపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొంధవా ప్రాంతంలోని ఓ ఆపార్టుమెంట్‌లోని ఓ ప్లాటులో ఐటి ఉద్యోగురాలి తన సోదరుడితో కలిసి నివసిస్తోంది. సోదరుడు బయటకు వెళ్లడంతో ఆమె ప్లాటులో ఒంటరిగా ఉంది అదే సమయంలో డెలీవరీ ఏజెంట్ లా వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. బ్యాంకు డాక్యుమెంటుపై సంతకం చేయాలని ఐటి ఉద్యోగిరాలికి చెప్పాడు. పెన్ను కోసం ఆమె ఇంట్లోకి వెళ్లగానే డోర్ క్లోజ్ చేసి ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. బాధితురాలు ఆ సమయంలో సెల్ఫీ తీయడంతో అతడు పాక్షికంగా కనిపిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు చెబితే వీడియోలు వైరల్ చేస్తానని నిందితుడు హెచ్చరించాడు. మళ్లీ వస్తానని ఆమెను బెదిరించి వెళ్లిపోయాడు. గంట తరువాత స్పృహలోకి వచ్చి బంధువులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డెలివరీ ఏజెంట్‌లా ఇంట్లోకి చొరబడి… ఐటి ఉద్యోగురాలిపై అత్యాచారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -