- Advertisement -
తిరుమల: తిరుపతిలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు కనిపించింది. ఏనుగులు వాహనదారుల దగ్గరికి రావడంతో భయంతో వణికిపోయారు. వాహనదారులు సమాచారం మేరకు టిటిడి సిబ్బంది. అటవీ శాఖ అధికారులు అక్కడి చేరుకొని పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగులను అటవీ ప్రాంతంలోని తరిమేశారు. ఓ ఏనుగుల గుంపు అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఏనుగుల గుంపు అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో వాహనదారులు, అటవీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -