Saturday, July 5, 2025

కెసిఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యశోద ఆస్పత్రికి ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత చేరుకుని ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జ్వరం, మధుమేహ సంబంధిత సమస్యలతో యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. గురువారం సాయంత్రం స్వల్ప నీరసంతో తమ ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక పరీక్షలలో అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్‌తో పాటు తక్కువ సోడియం స్థాయి ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని అన్నారు. మధుమేహం నియంత్రణ కోసం సోడియం స్థాయి పెంచేందుకు పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు వివరించారు. యశోద ఆస్పత్రికి బిఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుంటున్నారు. కెసిఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News