Saturday, July 5, 2025

ఖనిజాల ఉత్పత్తిలో కోల్ ఇండియా కీలక పాత్ర: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆత్మనిర్భర్ కు కోల్ ఇండియా అధిక ప్రాధాన్యం ఇస్తోందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఖనిజాల ఉత్పత్తిలో కోల్ ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కోల్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో కిషన్ రెడ్డి ప్రసంగించారు. స్థానికల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా కోల్ ఇండియా చర్యలు చేపట్టిందని, అత్యాధునిక సాంకేతికత వినియోగించి ఖనిజాల ఉత్పత్తి (Production minerals) జరుగుతుందని తెలియజేశారు. ఖనిజాల తవ్వకంలో కోల్ ఇండియా పారదర్శకంగా వ్యవహరిస్తోందని, 500 మినరల్స్ బ్లాక్స్ లో లీజ్ రెన్యువల్ సులభతరం చేసిందని చెప్పారు. లీజ్ రెన్యువల్ కు సింగిల్ విండో సిస్టం అందుబాటులోకి తెచ్చిందని, అరుదైన ఖనిజాల ఉత్పత్తిలోకి కోల్ ఇండియా అడుగు పెట్టిందని కిషన్ రెడ్డి ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News