Saturday, July 5, 2025

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలానికి 98,290 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 875.90 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టిఎంసిలుగా కాగా ప్రస్తుతం నీటి నిల్వ 167.87 టిఎంసిలుగా ఉంది. విద్యుదత్పత్తి చేసి 67,318 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News