Saturday, July 5, 2025

బిజెపి నేత శ్రీరాములు ఇంటి ముందు రోహింగ్యాల రెక్కీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు ఇంటి ముందు రోహింగ్యాలు రెక్కీ నిర్వహించారు. అందెల శ్రీరాములు ఇంటి ముందు అనుమానాస్పద తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బిజెపి కార్యకర్తలు, నేతలు గుర్తించారు. వారు పెట్రోల్ బాటిల్, సుత్తి, కట్టర్, ఐరన్ రాడ్స్, బాక్స్ లో పెట్టుకుని తిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా రోహింగ్యాలపై బిజెపి నేత అందెల శ్రీరాములు యాదవ్ ఉద్యమం చేస్తున్నారు. అందెల శ్రీరాములకు ప్రాణహాని ఉందని బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి నేతలు పట్టుకోవడానికి ప్రయత్నించగా వాహనం వదిలి పారిపోయారు. ఐదుగురు వ్యక్తులను గుర్తించి మీర్ పేట పోలీస్ స్టేషన్ కు బిజెపి నేతలు సమాచారం ఇచ్చారు. ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News