హైదరాబాద్: సిగాచి పరిశ్రమ లో జరిగిన బాంబు పేలుడులో మృతదేహాలను కార్డ్ బోర్డ్ పెట్టెల్లో తరలిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (kTR) తెలిపారు. పాశమైలారం పేలుడు ఘటన భయానక ఉదంతం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమవారి ఆచూకీ చెప్పాలని కుటుంబసభ్యులు కోరుతున్నారని తెలియజేశారు. ఘటనాస్థలంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కరోనా సమయంలో తమ ప్రభుత్వం వలన కార్మికులను ఆదుకుందని, రాష్ట్రాభివృద్ధిలో వలస కార్మికులు భాగస్వాములని మాజీ సిఎం కెసిఆర్ చెప్పారని పేర్కొన్నారు. వలస కార్మికులకు (migrant workers) ఉచితంగా రేషన్, రవాణా, వైద్య చికిత్స అందించామని అన్నారు. ఎస్ఎల్ బిసి ఘటనలో పరిహారం కోసం 8 కుటుంబాలు వేచి చూస్తున్నాయని తెలియజేశారు. వలస కార్మికులంటే సిఎం రేవంత్ రెడ్డికి అంత చులకనగా ఉందా? అని, మరణించిన కార్మికుల కుటుంబాలకు కూడా గౌరవం ఇవ్వరా? అని కెటిఆర్ ప్రశ్నించారు.
వలస కార్మికులంటే రేవంత్ రెడ్డికి అంత చులకనా? : కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -