Saturday, July 5, 2025

కమల దళానికి మహిళే సారథి?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నూతన అ ధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోందా..? పార్టీ చరిత్రలో అ త్యున్నత పదవిని తొలిసారి మహిళకు కట్టబెట్టబోతున్నారా..? అంటే అవుననే సమాధానం బిజెపిలోని హస్తిన వర్గాల నుంచి వస్తోంది. 2023 జనవరి మాసంతో ప్రస్తుత అధ్యక్షుడు జెపి నడ్డా పదవీ కాలం ముగిసిపోయినప్పటికీ వివిధ కారణాల రీత్యా దాన్ని ఈ ఏడాది జూన్ వరకు పొడిగిస్తూ వచ్చారు. అది కూడా ముగిసిపోవడంతో తొలుత రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామ కం, ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎ న్నిక మొదలు పెడతారు. త్వరలో అది కూడా కీలక దశకు చేరుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసిన బిజెపి ఈ సారి అధ్యక్ష పదవిలో ఆ ప్రాంతానికి చెందిన వారినే కూర్చోబెట్టాలని, ముఖ్యంగా మహిళలను మరింతగా పార్టీ వైపు ఆకర్షించే దిశగా వ్యూహ రచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి, సీనియర్ నాయకురాలు నిర్మలా సీతారమన్ పేరును అత్యం త ప్రాధాన్యతగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమెతో పాటు ఏపీలోని రాజమండ్రి ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి, తమిళనాడుకు చెందిన వనతి శ్రీ నివాస్ కూడా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ఉన్నట్లు సమాచా రం.

నిర్మలా సీతారామన్‌తో పాటు మిగతా ఇద్దరితో కూడా బిజెపి అగ్రనేతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ఇటీవల నిర్మలా సీతారామన్‌తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ మంతనాలు జరిపారు. ఆమెలో నా యకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకుపోయే సామర్ధం ఉన్నాయని బిజె పి నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. నిర్మలను అధ్యక్షురాలిగా నియమిస్తే దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి కలిసివస్తుందని కూడా ఆ పార్టీ పెద్దల ఆలోచనగా ఉంది. దేశంలో మహిళా రిజర్వేషన్లపై విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి పరిణామం పార్టీకి మరింత లబ్ధి చేకూర్చుతుందని, ప్రజల్లో బిజెపి పట్ల మరింత ఆదరణ, ముఖ్యంగా మహిళల్లో ఆ ధోరణి పెరిగిపోతుందన్నది కూడా బిజెపి ఆలోచనగా కనిపిస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం ఆర్థికమంత్రిగా, గతంలో రక్షణమంత్రిగా పనిచేస్తూనే బిజెపి కార్యకలాపాల్లో ఆమె చురుగ్గా ఉన్న అంశాలు కూడా ఆమెకు కలిసివచ్చేవే. అదే సమయంలో రాజమండ్రి ఎంపి, గతంలో ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా పనిచేసిన పురందేశ్వరి పేరును పరిగణనలోకి తీసుకున్నారు.

ఆమె ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రపంచ దేశాల్లో పర్యటించిన ప్రతినిధి బృందాల్లో ఓ బృందానికి ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇక తమిళనాడుకు చెందిన న్యాయవాది, రాజకీయనాయకురాలు వనతి శ్రీనివాసన్ పేరును కూడా బిజెపి హైకమాండ్ సీరియస్‌గా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆమె కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1993లో బిజెపిలో చేరిన శ్రీనివాసన్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2020లో వనతి శ్రీనివాసన్‌ను బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమించారు. 2022 నుంచి బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యురాలిగా ఉంటూ వస్తున్నారు. బిజెపిలో జాతీయస్థాయిలో తమిళనాడు నుంచి ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తి వనతి శ్రీనివాసనే. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వనతి నియామకం మరింత కలిసివస్తుందని కూడా బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది.

ఆర్‌ఎస్‌ఎస్ అనుమతి ఉందా..?
బిజెపి నిర్ణయాల్లో దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) పరోక్ష పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కీలక పదవిలో తొలిసారి ఓ మహిళను కూర్చోబెట్టనున్నారన్న సమాచారం మేరకు అందరి దృష్టి ఆర్‌ఎస్‌ఎస్‌పై కేంద్రీకృతమవడం సహజం. అయితే బిజెపి చేసిన ఈ ప్రతిపాదనకు ఆర్‌ఎస్‌ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహిళకు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే వారికి గుర్తింపునివ్వడమే కాకుండా వ్యూహాత్మకంగా కూడా కలిసివస్తుందని ఆ వర్గాలు అన్నట్లు సమాచారం. ఇటీవల కొన్ని రాష్ట్రాలకు ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు మహిళా ఓటర్లే కారణమని ఓ విశ్లేషణలో తేలిందని, ఇలాంటి సమయంలో చరిత్రలో తొలిసారి బిజెపి పీఠంపై మహిళను కూర్చొబెడితే అద్భుతంగా ఉంటుందని కూడా ఆ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News