Saturday, July 5, 2025

బిసి రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపం

- Advertisement -
- Advertisement -

దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ ఎన్నికల
సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం రాష్ట్రంలో రేవంత్
పాలన భేష్ హైదరాబాద్‌కు మోడీ చేసింది శూన్యం రాజ్యాంగంలోని
సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు
ఈ పదాలను తొలగించనివ్వం సామాజిక న్యాయ సమరభేరి
సభలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనితీరు బాగుందని ప్రశంసించడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ మాటలు.. వేషాలు మార్చడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తడం.. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూ రుకుపోయిందని దుయ్యబడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగం కొనసాగింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో కాంగ్రె స్ ప్రభుత్వం సంక్షేమ పధకాలను అమలు చేస్తోందని కొనియాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోందని, నిరుపేదలకు రేవంత్ సర్కార్ నాణ్యమైన సన్నబియ్యం అందిస్తుందన్నారు. రైతు భరోసా కింద రూ. 8,200 కోట్లను అన్నదాతల ఖాతాల్లోకి జమ చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో తాము ఏం చెప్పామో అవన్నీ ప్రత్యక్షంగా చేసి చూపించామని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కార్యకర్తలేనని మల్లికార్జున ఖర్గే అన్నారు.కేసీఆర్, బీజేపీ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. కానీ విజ్ఞులైన ప్రజలు ఆ రెండు పార్టీలను ఓడించి ఇంట్లో కూర్చొబెట్టాయని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలా అందరూ కలిసికట్టుగా భారత రాష్ట్ర సమితిని ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో ఖర్గే మాట్లాడారు. గతంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్‌షా అబద్ధాలు చెప్పి కేంద్రం లో అధికారంలోకి వచ్చారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. హైదరాబాద్‌కు మోదీ చేసింది శూన్యమని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం అందిస్తోందని, రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.8,200 కోట్లు జమ చేశారని కితాబిచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని, గిగ్ వర్కర్ల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తోందని చెప్పారు. దేశంలో తొలిసారి కులగణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని, బీసీల రిజర్వేషన్లు సాధించే వరకూ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.

ఆ విషయంపై
మోదీ ఎందుకు నోరు విప్పరు?
దేశ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ చిన్నాభిన్నం చేశారని, పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలని ‘ఆపరేషన్ సిందూర్’కు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. మరి మోదీ ఎందుకు యుద్ధాన్ని మధ్యలోనే ఆపేశారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేయగానే యుద్ధం ఆపేశారు.. కానీ ఆ విషయంపై ప్రధాని నోరు విప్పరన్నారు. గతంలో అమెరికా బెదిరించినా ఇందిరాగాంధీ భయపడలేదని, దేశం కోసం ఇందిర, రాజీవ్‌గాంధీ ప్రాణాలు అర్పించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఒక్కరైనా ప్రాణాలు అర్పించారా? అని ఖర్గే ప్రశ్నించారు.

మణిపూర్ ఈ దేశంలో భాగం కాదా
ఇప్పటి వరకు ప్రధాని 42 దేశాలు తిరిగారని, కానీ మణిపుర్ వెళ్లడానికి మాత్రం మనసు రాలేదని విమర్శించారు. ఆ రాష్ట్ర అంశంపై ఒక్కసారి కూడా ఆయన పెదవి విప్పలేదని, రాహుల్‌గాంధీ, తాను మణిపుర్ వెళ్లామని, మోదీ మాత్రం వెళ్లలేదన్నారు. మణిపుర్ ఈ దేశంలో భాగం కాదా? మణిపుర్ వాసులు భారతీయులు కాదా?సెక్యులర్, సోషలిస్టు పదాలను ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, మోదీ, అమిత్‌షా సహా ఎవరూ రాజ్యాంగం నుంచి తొలగించలేరని చెప్పారు. మోదీజీ.. ముందు దేశ ప్రజల బాధలు వినండి.. ఆ తర్వాత విదేశాల సంగతి చూడొచ్చు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని రాలేదని, బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారని ఖర్గే విమర్శించారు.

గతంలో అమెరికా బెదిరించినా ఇందిరా గాంధీ బెదరలేదని, వారి హెచ్చరికలను బేఖాతరు చేసి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించారని గుర్తు చేశారు. మోడీ విదేశాంగ విధానం సరిగా లేదని, తప్పుడు విధానంతో అందరినీ శత్రువులుగా మార్చుకుంటున్నారని అన్నారు. జై బాపు, జై భీమ్..జై సంవిధాన్ పేరుతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాలని పిలునిచ్చారు. సెక్యూలరిజంను రాజ్యాంగం నుంచి ఆర్‌ఎస్‌ఎస్, మోడీ, అమిత్ షాలు ఎవరూ తీసివేయలేరని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక గత 11 ఏళ్లలో ఏం తెచ్చారని ప్రశ్నించారు. మోడీ ప్రజలకు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని అన్నారు.

దేశంలో తొలిసారి కులగణన
దేశంలో తొలిసారిగా కులగణన తెలంగాణలో జరిగిందని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తెలంగాణ కులగణన దేశానికే ఓ రోల్ మోడల్గా నిలిచిందని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ హయాంలోనూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, తెలంగాణలో గత ప్రభుత్వం అత్యంత అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ నిలువునా మోసం చేశారని ఆరోపించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా చాలా చేశామని గొప్పలు చెప్పుకుంటుంన్నారని, కానీ, అసలు వాళ్లు ఈ దేశానికి, తెలంగాణ చేసిందేమిటని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News