- Advertisement -
కట్టంగూరు: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పామనిగుండ్లలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -