Saturday, July 5, 2025

చెల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని చంపేసి…. మట్టిదిబ్బలో పూడ్చిపెట్టారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: చెల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని ఓ యువకుడిని ఆమె సోదరుడు హత్య చేసి మట్టి దిబ్బలో పాతిపెట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా సామర్లకొట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పి వేమవరం గ్రామంలో నొక్కు వెంకట రమణ- స్వరూప దంపతులకు కిరణ్ (19) అనే కుమారుడు ఉన్నాడు. గత 27న కిరణ్ ఇంట్లో బయటకు వెళ్లి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశారు. కూలీ డబ్బులు ఎక్కువ ఇచ్చాడని తాను మందలించడంతోనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన నులతకట్టు కృష్ణ ప్రసాద్ తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు.

20 రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. తన చెల్లితో కిరణ్ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కిరణ్‌ను తన చెల్లితో మాట్లాడవద్దని కృష్ణ బెదిరించాడు. జూన్ 24న కృష్ణ తన స్నేహితుడు వినోద్‌తో కలిసి కిరణ్ చంపేయాలని ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్‌లో భాగంగా పార్టీ ఇస్తున్నానని బ్రహ్మానందపురం రమ్మని కిరణ్ కు వినోద్ కబురు పంపాడు. జగనన్న లేఔట్‌లో తీసుకెళ్లి కిరణ్ తలపై కృష్ణ, వినోద్ కర్రలతో కొట్టారు. అనంతరం గొంతునులిమి హత్య చేశారు. మృతదేహాన్ని మట్టిదిబ్బలో పూడ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రెండు రోజుల తరువాత కృష్ణ హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. ఈ విషయం బయటకు తెలుస్తుందనే భయంతో వినోద్‌ను కృష్ణ వెంటపెట్టుకొని విఆర్‌ఒ వద్ద లొంగిపోయారు. తామే హత్య చేశామని చెప్పడంతో విఆర్‌ఒ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమ కుమారుడిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కన్న కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News