హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసకున్నారు. పెళ్లి జరిగిన తరువాత వైవాహిక జీవితం ఆనందంగా సాగింది. విఘ్నేష్ కంటే ముందు శింబు, ప్రభుదేవాలతో నయనతార ప్రేమాయణం కొనసాగించింది. ఇద్దరితో విభేదాలు రావడంతో ప్రేమకు పుల్‌స్టాప్ పెట్టి విఘ్నేష్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ దంపతులకు సరోగసీతో ఇద్దరు పిల్లలకు జన్మనించారు. సోషల్ మీడియాలో నయనతార యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో తార ఒక పోస్టు చేసి డిలీట్ చేశారు.
తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు వివాహం అనేది పెద్ది తప్పు అవుతుందని, భర్త చేసే పనులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదని నయనతార తెలిపారు. పురుషులు మెచ్యూర్‌గా ఉండరని, తనని ఒంటరిగా వదిలేయాలని కోరారు. తన భర్తతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోస్టు చేసిన వెంటనే నయనతారా డిలీట్ చేశారు. ఈ పోస్ట్ స్క్రీన్ షాట్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార, విఘ్నేష్ మధ్య గొడవలు జరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ దంపతులు కూడా విడాకులు తీసుకునే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.