Sunday, July 6, 2025

ప్రేమ వివాహం… కొట్టుకున్న రెండు గ్రామాల ప్రజలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: యువతి, యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడంతో రెండు గ్రామాల ప్రజల దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నత్తగుళ్లపాడుకు చెందిన లక్ష్మీ ప్రసన్న అనే యువతి, చటకాయ గ్రామానికి చెందిన రోజా కమార్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఎదురించి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని బుచ్చిరెడిపాలెం పోలీసులను ప్రేమజంట విజ్ఞప్తి చేసింది. ఇరు గ్రామాలకు చెందిన పెద్దమనుషుల సమక్షంలో కైకలూరు తీసుకొస్తున్నారు. శ్రీపుర్ర గ్రామ శివారులోకి రాగానే చటకాయ గ్రామస్థులపై నత్తగుళ్లపాడు గ్రామస్థులు దాడి చేశారు. రెండు గ్రామాల ప్రజలు దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. పోలీసులు భారీగా అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కైకలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News