Sunday, July 6, 2025

ప్రభాస్ మాకు సాయం చేయలేదు.. : ఫిష్ వెంకట్ భార్య

- Advertisement -
- Advertisement -

సినీ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన బోడుప్పల్‌లోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో ఒక్క కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు తెలిపారు. అందుకు కనీసం రూ.50 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో సాయం కోరుతూ అతడి భార్య, కూతురు మీడియా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్ ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కిడ్నీ దాత ఉంటే మిగితా ఖర్చులన్నీ భరిస్తామని చెప్పినట్లు ప్రభాస్ టీమ్ ఫోన్ చేసినట్లు ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి చెప్పింది.

కానీ, అది ఫేక్ కాల్ అని తర్వాత తెలిసింది. అపదలో ఉన్న తమకు ప్రభాస్ పేరు చెప్పి ఆశలు కల్పించి.. ఇప్పుడు మరింత దుఃఖంలోకి నెట్టేశారని వెంకట్ కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. ప్రభాస్ అసిస్టెంట్ నుంచి ఫోన్ వచ్చిన మాట వాస్తవమే.. కావాల్సినంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఎవరూ స్పందించడం లేదని ఫిష్ వెంకట్ (Fish Venkat) భార్య తెలిపారు. నిజంగా తమకు సాయం అందితే.. అందింది అని చెబుతాం, కానీ మాకు ఎలాంటి సాయం అందలేదు అని ఆమె స్పష్టం చేశారు. నటుడి కూతురు మాట్లాడుతూ.. ప్రభాస్ పిఎ అంటూ ఐదు రోజుల కిందట తనకు ఫోన్ వచ్చిందని.. తన తండ్రి పరిస్థితి గురించి వివరిస్తే.. ప్రభాస్ షూటింగ్‌లో ఉన్నారు.. కాసేపు అయ్యాక కాల్ చేస్తామన్నారని.. అది నిజమనే తాను నమ్మినట్లు వెల్లడించింది. కానీ, ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేయడం లేదని.. తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News