Sunday, July 6, 2025

ఎంఎల్‌ఎ ఏలేటి మహేశ్వర రెడ్డికి సిట్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌ఎ, బిజెపి శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు. జుబ్లిహిల్స్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే శనివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా రామచంద్రరావు భాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో రాలేనని మహేశ్వర రెడ్డి సిట్ అధికారులకు తెలిపారు. అయితే వచ్చే బుధ,శుక్రవారాల్లో ఒక రోజు విచారణకు రావాలని సిట్ అధికారులు మహేశ్వర రెడ్డికి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు సాక్షుల స్టేట్‌మెంట్లను వరుసగా రికార్డు చేస్తున్నారు. ఇప్పటి వరకు 618 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. వీటిలో 236 మంది వాంగ్మూలాలను ఇప్పటికే అధికారులు రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికల్లో బిజెపి శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News