Sunday, July 6, 2025

40 ఏళ్ల క్రితం ఇద్దరిని చంపాను… పాపాలు వెంటాడుతున్నాయని..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: యుక్త వయసులోఉన్నప్పుడు హత్యలు చేసి ఇప్పుడు పాపాలు వెంటాడుతుండడంతో నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటన కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్‌కోడ్‌కు చెందిన మహ్మాద్ అలీ(53) తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. ఓ ప్రమాదంలో అలీ పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ చిన్నభిన్నమైంది. తాను చేసిన పాపాలు తన కుటుంబాన్ని వెంటాడుతున్నాయని మానసిక వేదనకు గురయ్యాడు. 40 సంవత్సరాల క్రితం రెండు హత్యలు చేశానని స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

రెండు హత్యలను దాచి పెట్టి బతకడం తన వల్ల కావడం లేదని పోలీసులు ఎదుట వాపోయాడు. 1986లో ఓ వ్యక్తి తనని వేధించడంతో ఆత్మరక్షణలో భాగంగా కాలువలోకి నెట్టేసి వెళ్లిపోయానన్నాడు. రెండు రోజుల తరువాత అక్కడికి వచ్చి గమనిస్తే అతడి మృతదేహం కనిపించిందని వివరించాడు. అప్పట్లో సాధారణ మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు మూసివేశారు. 1989లో వెల్లయిల్ బీచ్‌లో ఓ వ్యక్తి చంపేశానని పోలీసులకు తెలిపాడు. అప్పట్లో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో ఆధారాలు లేకపోవడంతో కేసును పోలీసులు క్లోజ్ చేశారు. రెండు కేసులను పోలీసులు బయటకు తీసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. మహ్మాద్ అలీ నిజాలు చెబుతున్నాడా? లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News