నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న పాన్- ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. (peddi) ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం లీడ్ నటీనటులతో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి మరో ఆసక్తికరమైన అప్డేట్ తెలిసింది.
ఈ సినిమా షూటింగ్ అప్పుడే ఏకంగా 55 శాతానికి పైగా పూర్తయిపోయిందట. మొన్న మార్చినాటికి 30 శాతం మేర పూర్తయిన ఈ సినిమా ఈ గ్యాప్‌లోనే మరో 30 శాతం దగ్గరకి వచ్చేసిందని చెప్పాలి. ఇలా మొత్తానికి అయితే పెద్ది సినిమా జెట్ స్పీడ్‌లో (jet speed) పూర్తవుతోందని చెప్పొచ్చు. ఇక జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.