Sunday, July 6, 2025

సర్పన్‌పల్లి ప్రాజెక్టులో ప్రైవేట్ దందా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టులో ప్రైవేట్ దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. అనుమతులు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులో బోటింగ్ నిర్వహిస్తున్నారు. శనివారం బోటు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.
మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. రిసార్ట్ నిర్వాహకులు లైఫ్ జాకెట్లు ఇవ్వకుండానే పర్యాటకులతో ప్రమాదకరంగా బోటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా దందా ఆగడంలేదు. పర్యాటకుల రాకతో యధేచ్ఛగా బోటింగ్ నిర్వహిస్తున్నారు.

రిసార్ట్‌కు కూడా పర్మిషన్ లేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఇరిగేషన్ భూములలో రిసార్ట్ నిర్మించారని ఆరోపణలు వస్తున్నాయి. పర్యాటకుల కోసం హుక్కా సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారని, కానీ అధికారులు మాత్రం పట్టించుకవోడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిసార్ట్ పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోరా? అని మండిపడుతున్నారు. ఇప్పటికైనా రిసార్ట్ ను తొలగించడంలో పాుట బోటింగ్ ను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News