అమరావతి: కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు, అప్రతిష్ఠపాలు చేసేందుకు విమర్శలు చేస్తున్నారని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (dholipalla Narendra Kumar) అన్నారు. పొన్నూరు దాడి ఘటన వైసిపి కావాలనే రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి (Attack Nagamalleshwara Rao) జరిగిన రోజు వైసిపి వాళ్లు కాపు కాశారని, తెలుగుదేశం నేత బండ్లమూడి బాబురావు, అశోక్ పై దాడి చేసేందుకు వైసిపి వర్గీయులు కుట్రపన్నారని నరేంద్ర విమర్శించారు. వైసిపి వాళ్లకు చెందిన ఆసుపత్రికి తరలించి, సరైన వైద్యం అందకుండా చేసినట్లు అనుమానం వస్తుందని, సరైన వైద్యం అందకుండా చేసి అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య మృతి కేసును నీరుగార్చేందుకు దాదాపు కోటి చేతులు మారినట్లు తెలుస్తోందని నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు.
పొన్నూరు దాడి ఘటనపై వైసిపి కావాలనే రాజకీయం చేస్తోంది: నరేంద్ర
- Advertisement -
- Advertisement -
- Advertisement -