Monday, July 7, 2025

నేడు ఢిల్లీకి సిఎం రేవంత్.. 2 రోజులు హస్తినలోనే మకాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః రాష్ట్రంలో యూరియా కొరత, మెట్రో రెండో దశ, ఆర్‌ఆర్‌ఆర్ వంటి పలు పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులనూ కలిసేందుకు ఆయన రెండు రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నారు. వర్షాలు కురుస్తున్నందున వ్యవసాయానికి అవసరమైన యూరియా రైతులకు అందుబాటులో ఉండడం లేదు కాబట్టి మరిన్ని టన్నుల యూరియా ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రి జెపి నడ్డాను కలిసి కోరనున్నారు. ఇంకా మెట్రో రెండో దశ విస్తరణకు డిపిఆర్, ఆర్‌ఆర్‌ఆర్ తదితర అంశాలపై కేంద్ర మంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగుతుర్తిలో ఈ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సిందిగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను, ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కోరనున్నారు. వరంగల్ జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలకు, జిల్లా మంత్రి కొండా సురేఖ దంపతులకు మధ్య నెలకొన్న వివాదం గురించి పార్టీ క్రమశిక్షణా సంఘం విచారణ చేపట్టిన విషయాన్నీ ఆయన అధిష్టానం దృష్టికి తేనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News