Wednesday, July 30, 2025

గంజాయి విక్రయిస్తూ ఇద్దరు అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.109కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని ప్రకాశం జిల్లాకు చెందిన శివసాయి అరకు నుంచి గంజాయి తీసుకుని వచ్చి నగరానికి చెందిన ప్రవీణ్, గణేష్‌తో అమ్మకాలు చేస్తున్నాడు. ఇద్దరు నిందితులు జూబ్లీహిల్స్ వెంకటగిరి కాలనీలో గంజాయి విక్రయిస్తుండగా ఎస్‌టిఎఫ్ ఎస్సై బాలరాజు, సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వచ్చిన ఎక్సైజ్ సిబ్బంది ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి, బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను జూబ్లీహిల్స్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News