Monday, July 7, 2025

అర్థరాత్రి చెట్ల నరికివేత.. వర్శిటీలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

అర్థరాత్రి చెట్ల నరికివేతతో విద్యార్థుల ఆందోళన
వర్శిటీ భూములు అన్యాక్రాంతం చేస్తే సహించేది లేదని హెచ్చరిక
సమాచార లోపంతోనే విద్యార్థుల ఆందోళన 
అగ్రి వర్శిటీ విసి అల్దాస్ జానయ్య

మన తెలంగాణ/రాజేంద్రనగర్: వర్తమానం, కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూముల రక్షణపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు, రైతులకు దేవాలయం వంటి విశ్వవిద్యాలయం భూములు కళ్ల ముందే అన్యాక్రాంతం అవుతుంటే చూస్తూ ఊరకోలేమని ఆందోళనకు దిగారు విద్యార్థులు. కానీ, తాజాగా పరిస్థితులపై సమాచార లోపం వారిలో ఆందోళనను మరింత ఉధృత స్థాయికి తీసుకువెళ్లిందని చెప్పాలి. శనివారం అర్థరాత్రి జేసీబీలతో యునివర్సిటీలోని 15 ఎకరాల స్థలంలో వన మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మొక్కలు నాటించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం హెచ్‌ఎండిఏ, అటవీశాఖల సహకారంతో చదును చేసే కార్యక్రమం మొదలు పెట్టింది.ముఖ్యమంత్రిచే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం ఆదివారం ఉదయం ఉంటుందనే సమాచారం శనివారం సాయంత్రమే వెలువడడం, యుద్ద ప్రాతిపధికన అధికార నుంచి పెద్ద సంఖ్యలో జేసీబీలను రప్పించి చెట్ల తొలగించే కార్యక్రమాన్ని చేపట్టడడంతో మరో భూభక్ష పథకం అమలు కాబోతుందని విద్యార్థి లోకం భావించింది. దాంతో విద్యార్థులు జేసీబీలు చదును చేస్తున్న ప్రాంతానికి తరలి వచ్చి అడ్డుపడంతో పోలీసులు రంగం ప్రవేశం చేసిన వారిని అక్కడి నుంచి పంపించి వేశారు.

విశ్వవిద్యాలయం భూములు అన్యాక్రాంతం చేస్తే సహించేది లేదు: విద్యార్థులు
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూముల ఉనికి దెబ్బతీస్తే సహించేది లేదని విద్యార్థులు హెచ్చరించారు. రియల్ ఎస్టెట్ సంస్థ ఆక్రమించినా, ఇతర సంస్థలకు లీజ్ పేరిట ఉన్న భూములు కట్టబెట్టి కనుమరుగు చేసేలా జరుగుతున్న ప్రయత్నాలు మానుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి విశ్వవిద్యాలయం ఆవరణలోని బోటానికల్ గార్డెన్ ప్రాంతంలో భారీ వృక్షాలు జేసీబీలతో తొలగిస్తున్న సమాచారం అందుకున్న విద్యార్థి నాయకుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. అర్థరాత్రి వేళ ఎందుకు చెట్లు తొలగిస్తున్నారు..? మరో భూ భక్షణకు రంగం సిద్దం చేస్తున్నారా..? అంటూ అక్కడ ఉన్న అధికారులు, సిబ్బంది, కార్మికులను నిలదీశారు. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అపోహలు నమ్మొద్ద్దు: ఉపకులపతి జానయ్య
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆవరణలో 12 ఏళ్లుగా ఆదరణకు నోచుకోని బోటానికల్ గార్డెన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అటవీ శాఖ ప్రారంభించనున్న వన మహోత్సవంతో తిరిగి పునరుజ్జీవం తీసుకువచ్చేందుకు కృషి జరుగుతుందని విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడించారు. మూడు నెలలుగా అటవీ శాఖ చెట్ల గణన, వాటి వల్లన ఉపయోగాలు, ఉత్పన్నమవుతున్న అనార్థల పై అధ్యాయనంతో చేసిన సిఫారసుల మేర 3000 సుబాబుల్ చెట్లతో పాటు 500 వరకు యుకలిప్టకస్ చెట్లులు తొలగించేందుకు అటవీశాఖ, హెచ్‌ఎండిఏ, విశ్వవిద్యాలయం అధికారులతో కూడిన నిపుణుల పర్యవేక్షణలో కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లె ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆదివారం బోటానికల్ గార్డెన్‌లో విద్యార్థులతో కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

అయితే ఈవిషయంలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సమాచారం లేకపోవడం, ముఖ్యమంత్రి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తారని శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తమకు సమాచారం వచ్చిందన్నారు. దాంతో బోటానికల్ గార్డెన్‌లో నిపుణులైన అధికారులు పేపర్ ప్రకటన ద్వారా టెండర్‌లో చెట్లు తొలగించే కాంట్రాక్ట్ పొందిన సంస్థకు యుద్ద ప్రాతిపధికన తాము సూచించినట్లు చెట్లు తొలగించి, మొక్కలు నాటే వీలుగా గోతులు తవ్వాలని ఆదేశించారని తెలిపారు. సదరు కాంట్రాక్టర్ అటవీశాఖ, హెచ్‌ఎండిఏ, యునివర్సిటీ అధికారులు పర్యవేక్షణలో భారీ సంఖ్యలో ఒక్కసారిగా జేసీబీలు తెప్పించి పనులు వేగవంతం చేయడం జరిగిందన్నారు. చీకటి పడిన తారువాత పెద్ద సంఖ్యలో జేసీబీలు రావడం, చదును చేస్తుండడంతో విశ్వవిద్యాలయం స్థలాన్ని కబ్జాచేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆందోళన చెంది విద్యార్థులు అక్కడి వచ్చిన ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News