Monday, July 7, 2025

బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: బుర్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బి.సి. రిజర్వేషన్ సాధన సమితి (బి.ఆర్.ఎస్.ఎస్) రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ,కాంగ్రెస్ జిల్లా నాయకుడు అవిశెట్టి అవిలిమల్లు లు అన్నారు.ఆదివారం బాబు జగ్జీవన్ రావు 39వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కేద్రం లోని చెరువు కట్ట చౌరస్తా ఆయన విగ్రహానికి బీసీ రిజర్వేషన్ సాధన సమితి ,ఎం ఆర్పీ ఎస్ ల ఆధ్వర్యంలో వేరు వేరుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు తన చిన్నతనం నుంచి ఉద్యమాల లక్షణాలను అలవార్చుకొని పేద ప్రజలపై సమస్యలపై నిరంతరం కృషి చేశారన్నారు. పేద ల సమస్యలపై ఉద్యమిస్తూనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చట్ట సభ ల్లో ప్రాతినిధ్యంవహించి భారత దేశ ఉప ప్రధానిగా విశిష్ట సేవలు అందించారని ఆయన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బిసి రిజర్వేషన్ సాధన సమితి జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య, పట్టణ అధ్యక్షులు నిలిగొండ మత్స్యగిరి, స్థానిక నాయకులు సిరిగిరి మస్తాన్, అన్నం దాసు మత్స్యగిరి, కూతాడి అంజయ్య, ఇటిక్యాల రాజు, లింగాల సత్తయ్య, బండారు శ్రీధర్ , ఎంఆర్ పిఎస్ మోత్కూర్ మండల అధ్యక్షులు. కూరెళ్ల శ్రీరాములు మాదిగ , యూత్ కాంగ్రెస్ మాజీమండల అధ్యక్షులు. మెంట నగేష్ , స్వామి రాయుడు , మాజీ ఎంపిటిసి ఎర్రవెల్లి , ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షులు. గజ్జెల్లి వినోద్ మాదిగ , గొలుసుల దుర్గయ్య , గజ్జెల్లి మహేష్, బందెల రవి, రాంపాక పాపయ్య, కూరెళ్ల రాములు, కూరెళ్ల కుమార్, వస్తుప్పుల కృష్ణ.
తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News