Monday, July 7, 2025

వరుస సినిమాలతో బిజీగా ఉన్నా..

- Advertisement -
- Advertisement -

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ‘బేబి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సక్సెస్ ఫుల్ యంగ్ నిర్మాత ఎస్ కెఎన్. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’, హిందీ ‘బేబి’తో పాటు ఇద్దరు కొత్త దర్శకులతో ఆసక్తికరమైన మూవీస్ రాబోతున్నాయి. సోమవారం పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మాత ఎస్‌కెఎన్ మీడియాతో మాట్లాడుతూ ‘హిందీ బేబి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. మ్యూజిక్ సిట్టింగ్స్ సహా ఈ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్‌గా పరిచయం చేస్తున్నాం. ఇప్పటిదాకా ఏడెనిమిది మందిని పరిచయం చేశాం.

మరో ఇద్దరు ముగ్గురిని త్వరలో పరిచయం చేయబోతున్నాం. హీరోయిన్స్‌గానే కాదు వివిధ విభాగాల్లోనూ అవకాశాలు ఇస్తున్నాం. లేడీ డైరెక్టర్స్‌ను కూడా పరిచయం చేస్తాం. చెన్నై లవ్ స్టోరీ సెట్స్ మీద ఉంది. కృష్ణ అనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్‌ను పరిచయం (Introducing Director) చేస్తున్నాం. ఆ మూవీ పూజ ఈ నెలాఖరులో చేస్తాం. ఈ చిత్రంలో ఒక ఫేమ్ ఉన్న హీరోయిన్‌తో పాటు ఇద్దరు యంగ్ హీరోలు ఉంటారు. హరి హర వీరమల్లు మూవీకి వర్క్ చేసిన అవినాష్‌ను డైరెక్టర్‌గా పెట్టి కన్నడలోని ఓ స్టార్ హీరో, మన తెలుగు నుంచి మిడ్ రేంజ్ హీరో కలిపి ఓ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఈ రెండు మూవీస్ వెంటనే ప్రారంభిస్తున్నాం. అలాగే రాజా సాబ్ తర్వాత మారుతితో ఒక సినిమా, సాయి రాజేశ్ తో మరో సినిమా చేయబోతున్నా. ఇక ప్రస్తుతం రాజా సాబ్ బ్యాలెన్స్ షూట్ చేస్తున్నాం. డిసెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాజా సాబ్ వస్తుంది’అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News