Monday, July 7, 2025

తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జూలై 19న గ్రాండ్‌గా తిరుపతిలో నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే.. తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం సహజం.

తాజాగా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) ట్రైలర్‌తో ఈ విషయం మరోసారి రుజువైంది. ట్రైలర్ విడుదలైన క్షణం నుండి అభిమానులు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని చారిత్రక యోధుడు పాత్రలో కనిపించడం అందరినీ ఆకర్షించింది. ట్రైలర్‌లో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందంటూ సినీ ప్రముఖులు సైతం ప్రశంసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కట్టిపడేసే లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తో.. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ప్రశంసలు అందుకుంటోంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం ట్రైలర్ నుంచే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ప్రారంభిస్తుందని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News