Tuesday, July 8, 2025

ఫిష్ వెంకట్ ను పరామర్శించి…. మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు ఫిష్ వెంకట్ ను బతికించుకుంటామని మత్స్య శాఖ, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. చికిత్స కోసం అయ్యే ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆర్‌బిఎం ఆస్పత్రిలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ ను  మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు. వెంకట్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. తెలంగాణ యాసలో గొప్పగా నటించిన నటుడు అని పేర్కొన్నారు.  చికిత్స పూర్తి అయ్యే వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో ఫిష్ వెంకట్ ను గుర్తు పట్టని వాళ్లు ఉండరని, త్వరగా కోలుకొని తిరిగి నటన కొనసాగించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని స్పష్టం చేశారు. సినిమాటోగ్రాఫీ మంత్రి కొమటి రెడ్డి వెంకట్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వాకిటి శ్రీహరి హామీ ఙచ్చారు. నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి మంత్రి శ్రీహరి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. మంత్రి వెంట ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డిలు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News