Tuesday, July 8, 2025

పోగొట్టుకున్న 69 ఫోన్లను అందజేసిన ఎసిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోన్లు పోగొట్టుకున్న బాధితులకు స్మార్ట్ ఫోన్లను ఎసిపి నరేష్ రెడ్డి అందజేశారు. కుత్బుల్లాపూర్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో బాలానగర్ ఎసిపి నరేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివిధ కారణాల రీత్యా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఇఐఆర్ పోర్టల్ ద్వారా కనుగొని బాధితులకు అందజేశామన్నారు. మొబైల్ పోయిన తర్వాత ఐఎంఇఐ నంబర్ తో సిఇఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరీ మొబైల్ ఫోన్ దొరికే అవకాశం ఉంటుందని వివరించారు. 15 లక్షల విలువ గల 69 మొబైల్ ఫోన్లను బాధితులకు ఎసిపి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News