Tuesday, July 8, 2025

కన్నప్పలో ఆ పాత్రలు ఇరిటేషన్ తెప్పించాయి: తమ్మారెడ్డి భరద్వాజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’. జూన్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) ఈ సినిమా గురించి మాట్లాడారు. సినిమా బాగుందని చెప్పిన ఆయన.. అన్ని కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదని అన్నారు. సినిమా రూ.200 కోట్లతో నిర్మిస్తే.. పది రోజుల్లో కేవలం రూ.50 కోట్లు కూడా వసూలు చేయలేకపోయిందని.. దీంతో నిర్మాత మోహన్‌బాబుకు తీవ్ర నష్టం వచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) మాట్లాడుతూ.. సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచన చేశారు కానీ.. భక్తి తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. భక్తే ప్రధానంగా సినిమా తీసి ఉంటే రూ.1000 కోట్ల కలెక్షన్లు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. సినిమాలో అందరూ చాలా బాగా నటించాని కితాబిచ్చిన ఆయన.. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్‌ను చూస్తుంటే తనకు ఇరిటేషన్ వచ్చిందని తెలిపారు. కన్నప్ప సినిమా చూస్తున్నంత సేపు ‘అన్నమయ్య’ సినిమా కాన్సెప్టు గుర్తుకు వచ్చిందని పేర్కొన్నారు. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ తీసుకున్నారని అన్నారు. ఏదేమైనప్పటికీ.. కన్నప్ప విషయంలో బాగా కష్టపడిన విష్ణును అభినందించాలని తెలిపారు. కానీ, ఆ కష్టానికి తగిన ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాను కొందరు ట్రోల్ చేసినా.. బ్యాడ్ రిపోర్టు రాలేదని.. ఒక్కసారి అయినా చూడాల్సిన సినిమాగా రివ్యూలు వచ్చాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News