ముంబై: మద్యం మత్తులో ముంబై నగరంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చేందిన రాజకీయ నాయకుడు జావేద్ షేక్ కుమారుడు (Politician Son) రాహిల్ జావేద్ పీకల దాక మద్యం తాగి నటి రాజశ్రీ మోరేతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కారును ఢీకొట్టి దర్భాషలాడాడు. అర్థ నగ్నంగా ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తన కారును ఎందుకు ఢీకొట్టావ్, ఎందుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నావ్ అని ప్రశ్నించగా.. ‘‘కారులో డబ్బులు ఉన్నాయి తీసుకో’’ అని అన్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన ఆదివారం (జూలై 6న) రాహిల్ (Politician Son) అంధేరి నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండగా జరిగింది. ఇరువురి మధ్య వాగ్వాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించగా.. వారితో కూడా రాహిల్ ఘర్షనకు దిగాడు. తాజా సమాచారం ప్రకారం రాహిల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.