బీట్‌రూట్‌ను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఇందులో ఉండే అనేక పోషకాలు రక్తహీనతను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరానికి తాజాగా ఉండే శక్తిని అందించడంలో సహాయపడుతాయి. వీటిలో ఐరన్, నైట్రేట్లు, విటమిన్‌లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని తరచూగా జ్యూస్, సలాడ్లు, సూప్‌లలో వినియోగిస్తారు. అయితే, ఈ బీట్‌రూట్ ఆరోగ్యకరమైనదే అయినా, కొన్ని పరిస్థితుల్లో ఇది మన ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది. తాజా నివేదికల ప్రకారం.. కొన్ని వ్యాధులతో బాధపడే వారు బీట్‌రూట్ తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మధుమేహం
షుగర్ ఉన్నవారు బీట్‌రూట్‌ను నియమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఇది సహజ చక్కెరలతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీని తినడం వల్ల షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి.
కిడ్నీలో రాళ్లు
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీట్‌రూట్‌ను తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. దీని తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెంచుతుంది.
లో బీపీ
బీట్ రూట్ తినడం లోబీపీ ఉన్నవారికి ప్రమాదకరం. బీట్‌రూట్‌లో నైట్రేట్లు ఉండటంతో రక్తనాళాలు విస్తరిస్తాయి. ఫలితంగా రక్తపోటు మరింతగా తగ్గి తల తిరగడం, బలహీనత వంటి సమస్యలు రావచ్చు.
అలెర్జీలు
చాలా మందికి బీట్‌రూట్ తిన్న తర్వాత చర్మం మీద గరుకుదనం, విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.