Tuesday, July 8, 2025

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో విషాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మణికొండలో కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూశారు. ఆయన అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పలు సినిమాలకు ఆయన గీతాలు రచించారు. 1932లో అక్టోబర్ 8న రాజమహేంద్రవరగంలో కొవ్వూరులో శివశక్తి దత్తా అలియాస్ కోడూరి సుబ్బారావు జన్మించారు. దత్తాకు ముగ్గురు కీరవాణి, కల్యాణి మాలిక్, శివశ్రీ కంచి ఉన్నారు. ఆయనకు ఒక్క అన్న నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. దత్తా తమ్ముడు సీనిరచయిత విజయేంద్ర ప్రసాద్ ఉన్నారు.

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, గాయని, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖకు దత్తా పెద్దనాన్న అవుతారు. చిన్నతనంలో కళలపై మక్కువ ఉండడంతో దత్త ఇంటి నుంచి పారిపోయి ముంబయిలోని ఓ ఆర్ట్ కళాశాలలో చేరారు. సంగీతంపై ఇష్టంతో గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. తన సోదరుడు విజయేంద్రప్రసాద్‌తో కలిసి సినీరంగలోకి ప్రవేశించారు. 1988లో జానకి రాముడు చిత్రంతో ఆయనకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. పలు సినిమాలకు ఆయన స్క్రీన్‌రైటర్‌గా పని చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామం రాఘవమ్, బాహుబలి-1లో మమతల తల్లి, చత్రిపతి మూవీలో మన్నేల తింటివిరా, దీవర, బాహుబలి 2లో సాహోరే బాహుబలి, కథానాయకుడు సినిమాలో కథానాయక,  హనుమాన్ అంజానద్రి థీమ్ సాగ్, సై సినిమాలో నల్లా నల్లాని కళ్ల పిల్ల, రాజన్న సినిమాలో అమ్మా అవని పాటలకు లిరిక్స్ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News