- Advertisement -
బెంగళూరు: ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు మోసం చేసిన 30 ఏళ్ల తరువాత సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం కార్వార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శిరసికి గ్రామానికి చెందిన కేశవమూర్తి రావు అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని వెంకటేశ్ మహదేవ్ నుంచి రూ.200 తీసుకున్నాడు. 1995లో డబ్బులు తీసుకొని కేశవమూర్తి పారిపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ వెంకటేశ్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో కేసును పక్కన పడేశారు. 30 ఏళ్ల తరువాత కేశవ సొంతూరుకు రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పలువురు దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసినట్టు కేశవపై ఆరోపణలు ఉన్నాయి.
- Advertisement -