- Advertisement -
చెన్నై: తమిళనాడు రాష్ట్రం కడలూరు ప్రాతంలో స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్టు సమాచారం ఈ ప్రమాదంలో మరో 12 మంది త్రీవంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గేట్‌మెన్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రైలు ఢీకొట్టడంతో స్కూలు బస్సు తునాకతునకలుగా మారింది.
- Advertisement -