లింగాలఘనపురం: మద్యానికి బానిసగా మారి భార్యలను వేధిస్తుండడంతో భర్తను గొడ్డలి ఇద్దరు భార్యలు నరికి చంపారు. ఈ సంఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఏనబావి గ్రామ శివారులో పిట్లోనిగూడెంలో కాల్వ కనకయ్య(30) ఇద్దరు భార్యలతో కలిసి ఉంటున్నాడు. కనకయ్య మద్యానికి బానిసగా మారాడు. మే నెలలో మద్యం మత్తులో అక్కను కనకయ్య హత్య చేసి పారిపోయాడు.
అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ భార్యలతో పాటు గ్రామస్థులను బెదిరించేవాడు. అతడి ఆగడాలకు ఎక్కువ కావడంతో భార్యలు విసిగిపోయారు. సోమవారం రాత్రి ఇంటికి చేరుకొని భార్యలను చంపేస్తానని గొడ్డలి పట్టుకొని తిరిగాడు. దీంతో భార్యలు ఎదురుతిరిగి గొడ్డలి తీసుకొని అతడిని నరికేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.