Wednesday, July 9, 2025

ఆదివాసీ మహిళను టార్గెట్ చేసి కెటిఆర్ సాధించేది ఏమిటి?: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదివాసీ మహిళ అని చూడకుండా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తనను టార్గెట్ చేసుకున్నారని మంత్రి సీతక్క (Sitakka) తెలిపారు. కెటిఆర్ వ్యాఖ్యలపై సీతక్క మండిపడ్డారు. ములుగు జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఆదివాసీ మహిళను టార్గెట్ చేసి కెటిఆర్ సాధించేది ఏమిటి? అని ప్రశ్నించారు. కెటిఆర్ సొంత చెల్లె బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆయన అహంకారానికి చూసి మట్టి పోస్తోందని విమర్శించారు. 70 ఏళ్ల చరిత్రలో కోయ వర్గానికి మంత్రి పదవి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తానేమైనా తప్పులు చేస్తే అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయాలని సూచించారు. గత పదేళ్లలో ఎంతోమంది ఆత్మహత్యలకు కారణం బిఆర్ఎస్ అని ధ్వజమెత్తారు. ములుగులో నడుస్తున్నది ప్రజారాజ్యం, ప్రజాపాలన అని సీతక్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News