- Advertisement -
హైదరాబాద్: ఉద్యమ సమయంలో లాగా సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ కి వ్యతిరేకంగా వార్తలు రాస్తే మీడియాపై దాడులు చేయడం సరికాదని అన్నారు. చామల మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ కార్యకర్తలను బావ బామ్మర్దులు మాజీ మంత్రి హరీష్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లు రెచ్చగొడుతున్నారని ( provoking activists) మండిపడ్డారు. బిఆర్ఎస్ గురించి తప్పుగా మాట్లాడితే ఆంధ్రా చానల్ అంటున్నారని విమర్శించారు. తెలుగువాళ్ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి హైదరాబాద్ లో ప్రశాంతత చెడగొడుతున్నారని చామల కిరణ్ కుమార్ ధ్వజమెత్తారు.
- Advertisement -