ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఘోర ఓటమి తర్వాత మూడో టెస్ట్‌లో భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ జట్టు (England Team) పట్టుదలతో ఉంది. జూలై 10వ తేదీన లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ 16 సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన గస్ అట్కిన్సన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రెండో టెస్ట్‌కు ముందు ప్రకటించిన జట్టులో జోఫ్రా ఆర్చర్‌కి చోటు కల్పించిన విషయం తెలిసిందే.
అయితే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న ఇంగ్లండ్ రెండో టెస్ట్‌లో అదే జట్టును కొనసాగించింది. దీంతో జోఫ్రా ఆర్చర్‌ని తుది జట్టులోకి (England Team) తీసుకోలేదు. కానీ, ఇంగ్లండ్ ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో మూడో టెస్ట్ కోసం అడే జట్టును పకడ్బందీగా బరిలోకి దించాలని వ్యూహాలు రచిస్తోంది. తొలి రెండు టెస్టుల్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన క్రిస్ వోక్స్‌ని జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో ఆర్చర్ లేదా అట్కిన్సన్‌ని జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ బలపడనుంది. దీంతో భారత్‌కు కష్టాలు తప్పవని నిపుణుల అంచనా.
కాగా, ఎడ్జ్‌బాస్టన్‌లో ఘన విజయం తర్వాత భారత్ మూడో టెస్ట్‌పై కన్నేసింది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వస్తాడు. లార్డ్స్ పిచ్‌పై బుమ్రా సత్తా చాటే అవకాశం ఉంది. బుమ్రా జట్టులోకి వస్తే.. ప్రశిద్ధ్ కృష్ణని జట్టు నుంచి తప్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఎవరూ విజయాన్ని వరిస్తారో వేచి చూడాలి.