Tuesday, July 8, 2025

నేను ఇంట్లో ఉంటే చంపేసేవారు: ప్రసన్న కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన ఇంటిపై టిడిపి గుండాలు దాడి చేశారని వైసిపి నేత, మాజీమంత్రి నల్లపు ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆ సమయంలో తాను ఇంట్లో ఉండే చంపేసే వారని పేర్కొన్నారు. 70 నుంచి 8 0 మంది టిడిపి మూకలు ప్రసన్న రెడ్డి ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ప్రసన్న కుమార్ రెడ్డి తల్లిని కూడా బెదిరించారు. ఈ సంఘటనపై ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చరిత్ర నెల్లూరు జిల్లా వాసులకు తెలుసునని చురకలంటించారు. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలతో దాడులకు పాల్పడడం మంచిది కాదని హితువు పలికారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయన్నారు. తాను మాట్లాడని ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని వివరణ ఇచ్చారు. ఎపిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ప్రసన్న దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ కూడా మాట్లాడారు. 200 మంది దుండగులు ఇంట్లో చొరబడి విధ్వంసం సృష్టించారని తెలిపారు. తన కుమారుడు ఎక్కడ ఉన్నాడని తనని బెదిరించారని, తన ఆరోగ్యం సరిగా లేదని, రాత్రి జరిగిన ఘటనతో భయాందోళనకు గురయ్యానని వివరణ ఇచ్చారు. నత కుమారుడు ఇంట్లో ఉంటే హత్య చేసేవారని ఆమె బాధను వ్యక్తం చేశారు. 200 టిడిపి కార్యకర్తలు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడి సిసి కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం కారు, ఫర్నీచర్ ను పగులగొట్టారు. 30 నిమిషాలు పాటు బీభత్సం సృష్టించడంతో పాటు సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News