Wednesday, July 9, 2025

వెనుకబడ్డాను అనే భావనలో కెటిఆర్ : అద్దంకి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పేరులోనే తెలంగాణ ఉండటం ఇష్టం లేకే బిఆర్ఎస్ అని మార్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ( Addanki Dayakar) తెలిపారు. తెలంగాణాను నట్టేట ముంచిందే బిఆర్ఎస్ అని అన్నారు. ఈ సందర్భంగా  సిఎల్పి కార్యాలయంలో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడుతూ.. అనుకూలంగా రాయలేదని మీడియాలో ఆంధ్ర, తెలంగాణ అనే విద్వేషాలు రెచ్చగొడతారా? అని ప్రశ్నించారు. బేసిన్లు, బేషజాలు లేకుండా ఎపి కూడా నీళ్లు తీసుకోవాలని మాట్లాడలేదా? అని అద్దంకి నిలదీశారు. ఏడాదిన్నర రైతుల ఖాతాల్లోనే రూ. 50 వేల కోట్లు వేశామని తెలియజేశారు.

నిరంకుశంగా వ్యవహరించింది ఎవరో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. మాజీ మంత్రి హరీష్ రావు, కెటిఆర్, ఎమ్మెల్సీ కవిత మధ్య పోటీ నెలకొందని అన్నారు. హరీష్ రావు, కవిత దూసుకుపోతుంటే వెనుకబడ్డాను అనే భావనలో కెటిఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. హరీష్ రావు, కవిత మధ్య ఉనికి చాటుకునేందుకే కెటిఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీలో(BRS party) నలుగురు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? అని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా బిఆర్ఎస్ లో నలుగురే కనిపిస్తారని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అందరికీ అవకాశాలు ఉంటాయని అందరికీ ప్రాధాన్యం ఉంటుందని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News