మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘భైరవం’ (Bhairavam). విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకుడు. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘గరుడన్’ అనే సినిమా రీమేకే ఈ చిత్రం. ఈ ఏడాది మే 30న ఈ సినిమా విడుదలైంది. అయితే దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఈ సినిమా ఒటిటిలో రానుంది. ప్రముఖ ఒటిటి సంస్థ ‘జి5’లో ఈ సినిమా జూలై 18వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జి5 అధికారికంగా ప్రకటించింది. ఇందకు సంబంధించి ఓ చిత్రానికి సంబంధి ఓ గ్లింప్స్‌ని పోస్ట్ చేసింది.
ఇక ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాలా సంగీతం అందించగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ సినిమాను (Bhairavam) నిర్మించారు. హీరోయిన్లుగా ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై హీరోయిన్లుగా నటించారు. అలనాటి నటి జయసుధ కీలక పాత్రలో ఈ సనిమాలో కనిపించారు. మరి థియేటర్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఒటిటిలో ప్రేక్షకుల మనస్సు దోచుతుందో..? లేదో..?