నేటి బిజీ లైఫ్ లో అనేక కారణాలవల్ల చాలామంది ఒత్తిడికి గురై నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రంతా మేల్కొనడం, సరిగ్గా నిద్రపోకపోవడం వలన అలసట, బద్ధకంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు నిద్ర కోసం మాత్రలు లేదా మద్యం సేవించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవి తాత్కాలిక ఉపశమనం ఇచ్చిన దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం. అయితే రాత్రిపూట నిద్ర రావాలంటే పాలు తాగొచ్చు. పాలలో కాల్షియం, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి నిద్రకు ఎంతో సహాయపడతాయి. ఇక రాత్రి నిద్రకు ముందుగా ఈ మూడు పదార్థాలను పాలలో కలిపి తీసుకుంటే గాఢ నిద్ర రావడమే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు.
తేనే పాలు
తేనె పాలను రాత్రి త్రాగితే కండరాలను సడలిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇది ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
అశ్వగంధ పాలు
అశ్వగంధ ఒక ప్రముఖ ఆయుర్వేద ఔషధం. ఇది అనేక నిద్ర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పాలు తాగితే నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి నిద్రలేమిని తగ్గిస్తుంది.
పసుపు పాలు
పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం మనసును ప్రశాంత పరుస్తుంది. ఇది అలసటను తగ్గించి గాఢ నిద్రకు తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ పాలును తాగితే అలసట నుండి ఉపశమనం కలుగుతుంది.