Sunday, August 24, 2025

ట్రంప్‌కు నోబెల్ ప్రతిపాదనలపై అసదుద్దీన్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్, ఇజ్రాయిల్ ప్రతిపాదించడాన్ని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరూ డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించారని, అయితే మునీర్ భారతదేశంలో ఉగ్రవాదులను పంపించే కీలక వ్యక్తి అయితే, నెతన్యాహు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి పారిపోయిన వ్యక్తి, అని అతను పాలస్తీనియన్లపై బహిరంగంగా మారణహోమానికి పాల్పడ్డాడని అసదుద్దీన్ ఆరోపించారు. వీరిద్దరి చర్యలకు యుఎస్‌ఎ ఆమోదం ఉందని అసదుద్దీన్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News