Wednesday, July 9, 2025

ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% మహిళలకే

- Advertisement -
- Advertisement -

బీహార్ సిఎం నితీశ్ కుమార్ ప్రకటన
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తాయిలం

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూ హాలకు పదును పెడుతున్నాయి. ప్రజాకర్షక నిర్ణయాలు ప్రకటించడంలో పోటీ పడుతున్నాయి. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అలాంటి ప్రకటనే చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీహార్‌లో శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా ప్రతి విభాగం లోని అన్ని పోస్టులకు ఆ ప్రత్యేక రిజర్వేన్ వర్తిస్తుందని సీఎం చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ సర్వీసుల్లో స్త్రీల పాతినిధ్యాన్ని పెంచడమే తమ లక్షమని పేర్కొన్నారు. పాట్నాలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఓటర్ల కోసం రిజర్వేషన్ ప్రకటించగా, యువత కోసం బీహార్ యూత్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనికింద యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, శిక్షణ ఇస్తామని వెల్లడించారు. వారి సంక్షేమం, ఉన్నతికి సంబంధించిన అంశాలపై కమిషన్ సలహాలు ఇవ్వొచ్చు. అలాగే మెరుగైన విద్య , ఉపాధి అవకాశాల విషయంలో ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోనుంది. ఇదిలా ఉంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారపక్షమైన ఎన్డీయే, ప్రతిపక్ష మహాగట్ బంధన్ సీట్ల పంపిణీకి సిద్ధమవుతున్నాయి.

ఈ మేరకు మిత్ర పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన కూటముల్లోనూ అంతర్గత విభేదాలనూ అధిగమించడానికి గతేడాది లోక్‌సభ ఎన్నికల ప్రాతిపదికన సీట్ల పంపకం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు విపక్ష కూటమి మహాగట్ బంధన్ సీట్లపంపిణీపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించింది. దీనికి అన్ని పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యారు. కొన్ని పార్టీలు తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. అన్ని పార్టీలు తాము పోటీ చేయాలనుకొంటున్న సీట్ల జాబితా ఇవ్వాలని ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్ మిత్ర పక్షాలను కోరారు. ఈ ఏడాది అక్టోబర్ , నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News