Wednesday, July 9, 2025

రైలులో గ్యాంగ్ రేప్.. మహిళను రైలు పట్టాలపై విసిరేసి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హర్యానాలో పానిపట్ రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులోని ఖాళీబోగీలో ఓ మహిళపై సామూహిక అత్యచారం చేసిన దుండగులు, ఆమెను సోనిపట్ రైలుపట్టాలపై విసిరివేయడంతో ఆమె రెండుకాళ్లు పోగొట్టుకున్నట్లు తెలిసింది. జూన్ 24 నుంచి ఆమె కనిపించకుండా పోయిందని ఆమె భర్త జూన్ 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె గతంలో కూడా ఇలా కనిపించకుండా పోయినా, తనంత తానే తిరిగి ఇంటికి వచ్చేదని పేర్కొన్నాడు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. తాను పానిపట్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉండగా ఓ వ్యక్తి తన భర్త తీసుకురమ్మన్నాడని చెప్పి తనను తీసుకువెళ్లి ఖాళీగా ఉన్న బోగీలో ఎక్కించాడని, అతడు, మరో ఇద్దరు తనపై అత్యాచారం చేశారని, తర్వాత సోనిపట్ రైల్వేస్టేషన్‌కు తీసుకువెళ్లి తనను రైలుపట్టాలపై విసిరివేశారని, తనపై నుంచి రైలుపోవడంతో కాళ్లు కోల్పోయామని చెప్పినట్లు ఆమె పోలీసులకు వివరించింది. పట్టాలపైపడి కాళ్లు కోల్పోయిన ఆ మహిళ అరుపులు, ఏడుపు విని సమీపంలో దుకాణందారు, స్థానికులు రైల్వే పోలీసులకు తెలుపడంతో వాళ్లు మొదట సోనిపట్ జనరల్ ఆస్పత్రికి, తర్వాత రోహక్ పిజిఐకి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు గ్యాంగ్‌రేప్ కేసు నమోదు చేసి, పానిపట్ రైల్వేపోలీసులకు కేసు అప్పగించారు. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News