Thursday, July 10, 2025

ప్రైమ్ డే 2025 వచ్చేస్తోంది.. అమేజాన్ పేతో మరిన్ని ప్రయోజనాలు

- Advertisement -
- Advertisement -

ప్రైమ్ డే 2025 సమీపించింది. ఈ ఏడాది జులై 12 నుండి 14, 2025 వరకు ఉంటుంది. ఈ ఏడాది, ఇది 72 గంటల ప్రత్యేకమైన డీల్స్, కొత్త విడుదలలు, బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ తో మరింత పెద్దగా , మెరుగ్గా ఉండబోతోంది. అయితే మీరు స్మార్ట్ షాపర్ అయినట్లయితే, ఆఫర్ల కంటే ఎక్కువగా డీల్ కు ప్రత్యేకించి మీరు అమేజాన్ పేని ఉపయోగించినప్పుడు మరింత ఉంటుందని మీకు తెలుసా. ట్రావెల్, బిగ్-టిక్కెట్ బైస్ నుండి రోజూవారీ అవసరాలు, గిఫ్ట్ కార్డ్స్ వరకు, మీరు మీ రూపాయిని ఏ విధంగా ఉపయోగించవచ్చో మరియు ఈ ప్రైమ్ డేకి మరింత విలువను ఏ విధంగా పొందవచ్చో ఇక్కడ చూడండి.

ప్రతి బిగ్ బై మీ కోసం ఎక్కువగా ఉపయోగపడేలా చేయండి:మీరు ప్రైమ్ డే సమయంలో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, లేదా ఫ్యాషన్ ను కొనుగోలు చేయడానికి ప్రణాళిక చేస్తే, అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో చెల్లిస్తే ఎంతో తేడా కనిపిస్తుంది. ప్రైమ్ సభ్యులు ఎల్లప్పుడూ 5% క్యాష్ బాక్ పొందవచ్చు. ప్రైమ్ డే సమయంలో, వారు అదనంగా 5% తక్షణ క్యాష్ బాక్ కూడా స్వీకరించవచ్చు, ఇది ఇప్పటికే గొప్ప డీల్స్ గా ఉన్న వాటిని మరింత మెరుగ్గా చేస్తుంది. మొదటిసారి ప్రైమ్ కార్డ్ హోల్డర్స్ గా ఉన్న వారు రూ. 200 క్యాష్ బాక్ మరియు రూ. 2,800- సాధారణ ఆఫర్ కంటే ఎక్కువగా రూ. 500 సహా రూ. 3,000 విలువైన వెల్కం రివార్డ్స్ సంపాదించవచ్చు. నాన్-ప్రైమ్ సభ్యులు కూడా అవకాశం అందుకుంటారు, రూ. 2,000 వరకు విలువైన రివార్డ్స్ మరియు తమ ప్రైమ్ సభ్యత్వంపై రూ. 500 తగ్గింపు పొందుతారు. ICICI బ్యాంక్ లేదా SBI క్రెడిట్ /డెబిట్ కార్డ్స్ ఉపయోగించే వారు, అదనంగా అర్హమైన కొనుగోళ్లు, EMI లావాదేవీల పై అదనంగా 10% తిరిగి పొంది ఆదాలు చేయవచ్చు.

సరళంగా ఉంచండి మరియు పునరావృతం చేసిన కొనుగోళ్లపై బహుమతులు పొందండి: ప్రైమ్ డే సమయంలో చిన్న లేదా పునరావృతం చేసిన కొనుగోళ్లను చేసే ప్రైమ్ సభ్యులు ఇప్పుడు మరింత సంపాదించవచ్చు. అమేజాన్ పే UPIని ఉపయోగించి చెల్లించండి మరియు రూ. 1000 లేదా అంతకంటే ఎక్కువ విలువ గల మీ రెండవ ప్రైమ్ డే కొనుగోలు పై ఫ్లాట్ రూ. 100 క్యాష్ బాక్ పొందండి. సేల్ కోసం మీ అమేజాన్ పే బ్యాలెన్స్ ను టాప్ అప్ చేయాలని కోరుకుంటున్నారా? రూ. 1,000 లేదా అంతకంటే ఎక్కువ చేర్చండి మరియు తక్షణమే రూ. 100 పొందండి, చెక్ అవుట్స్ ను నిరంతరంగా కొనసాగిస్తూనే మీ బ్యాలెన్స్ మరింత పెంచుకోండి.

తెలివిగా బహుమతి ఇవ్వండి, ఎక్కువ ఆదా చేయండి: పండగల సమయంలో బహుమతులు ఇవ్వాలని ప్రణాళిక చేస్తున్నారా లేదా భవిష్య కొనుగోళ్ల కోసం ఏదైనా బ్యాక్ అప్ విలువను ఉంచాలని కోరుకుంటున్నారా? ప్రైమ్ డే సమయంలో డిజిటల్ గిఫ్ట్ కార్డ్స్ కొనడం ఎంపిక చేసిన బ్రాండ్ కార్డ్స్ పై 10% వరకు తగ్గింపుతో ఖర్చు చేసినప్పుడు కూడా మీకు సహాయపడుతుంది. ముఖ్యంగా మీరు రెగ్యులర్ గా కొనుగోలు చేసే వ్యక్తి అయినప్పుడు లేదా పండగ బహుమతుల కోసం ప్రణాళిక చేస్తున్నప్పుడు అదనపు విలువను లాక్ ఇన్ చేయడం తెలివైన విధానం.

మీ ప్రయాణ ప్రణాళికలకు ప్రైమ్ డే అప్ గ్రేడ్ ఇవ్వండి: మీరు ఏదైనా ట్రిప్ గురించి ఆలోచిస్తుంటే, అమేజాన్ పే ద్వారా ప్రైమ్ డే ప్రధానమైన ప్రయాణ ఆదాలను తెస్తోంది. డొమేస్టిక్ విమానాల పై మీరు 25% వరకు, అంతర్జాతీయ బుక్కింగ్స్ పై 8,000 వరకు తగ్గింపును ఆదా చేయవచ్చు, మరియు ప్రముఖ గమ్యస్థానాల్లో హోటళ్లల్లో బస చేయడంపై 60% వరకు తగ్గింపును ఆనందించవచ్చు. ఎంపిక చేసిన మూవీ టిక్కెట్ బుక్కింగ్స్ పై రూ. 100 క్యాష్ బాక్ తో మీ మూవీ నైట్స్ కూడా కవర్ చేయబడతాయి. ఇవన్నీ కూడా కార్డ్ రివార్డ్స్ మరియు పే లేటర్ ప్రయోజనాలతో కలిసి ఉన్నాయి.

సరళంగా ఉండాలా? ఇప్పుడే కొనండి, తరువాత చెల్లించండి: అమేజాన్ పే లేటర్ కొనుగోలు చేయడానికి ఒక సులభమైన మార్గాన్ని అందిస్తోంది మరియు మీ చెల్లింపులను విస్తారం చేస్తోంది. షాపింగ్, రీఛార్జెస్, బిల్లు చెల్లింపులు, లేదా ప్రయాణాల పై అర్హులైన కస్టమర్లు తక్షణమే రూ. 60,000 వరకు క్రెడిట్ పొందవచ్చు. మీరు వచ్చే నెలలో చెల్లించడాన్ని లేదా కొనుగోళ్లను 3-12 నెలల EMIలుగా మార్చడాన్ని కేవలం ఒక క్లిక్ తో ఎంచుకోవచ్చు. కొత్త యూజర్లు కూడా రూ. 600 విలువ గల రివార్డ్స్ పొందవచ్చు, ఇప్పటికే పే లేటర్ యూజర్స్ గా ఉన్న వారు ప్రత్యేకమైన ప్రైమ్ డే బోనస్ లను ఆనందించవచ్చు.

ఇంకా ప్రైమ్ సభ్యులు కాలేదా, అయితే ఇప్పుడు సమయం వచ్చింది: ప్రైమ్ సభ్యత్వం మూడు టియర్స్ తో లభిస్తోంది. వార్షిక సభ్యత్వం రూ. 1,499కి, లైట్ రూ. 799కి మరియు షాపింగ్ ఎడిషన్ రూ. 399కి లభిస్తోంది. తమ అవసరాలకు తగిన సభ్యత్వాన్ని కస్టమర్లు ఎంచుకోవచ్చు. దానితో పాటు ప్రైమ్ డే డీల్స్ పొందవచ్చు, మీరు వేగవంతమైన మరియు ఉచిత డెలివరీ, ప్రైమ్ వీడియో, అమేజాన్ మ్యూజిక్,ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్ మరియు ఇంకా ఎన్నో వాటిని పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News