న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్‘ అనే డాక్యుమెంటరీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. 2024లో విడుదలైన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని చూపించారు. ఇందులో నయనతార భర్త విఘ్నేష్ శివన్, వారి కవల పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే, ఈ డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత వివాదంలో చిక్కుకుంది. కోలీవుడ్ హీరో ధనుష్, నయనతార మధ్య కోల్డ్ వార్ జరిగింది. ఈ క్రమంలో ధనుష్ నయనతారపై కేసు కూడా దాఖలు చేశారు. తాజాగా డాక్యుమెంటరీ నిర్మాతలకు మరో షాక్ తగిలింది. 2005 సూపర్‌హిట్ చిత్రం ‘చంద్రముఖి’కి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ నిర్మాతలకు మరో షాక్ తగిలింది.
డాక్యుమెంటరీ నిర్మాతలకు.. ‘చంద్రముఖి’ సినిమా హైక్కుదారు AP ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ డ్యాకుమెంటరీలో తమ అనుమతి లేకుండా సినిమాలోని కొన్ని సన్నివేశాలు, పాటలను ఉపయోగించారని ఆరోపించారు. డాక్యుమెంటరీలో ఉపయోగించిన ‘చంద్రముఖి’ ఫుటేజ్‌పై శాశ్వత నిషేధం విధించాలని AP ఇంటర్నేషనల్ కోర్టును డిమాండ్ చేసింది. దీనితో పాటు, ఈ ఫుటేజ్‌లను డాక్యుమెంటరీ నుండి తొలగించాలని కోరింది. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు.. డాక్యుమెంటరీ నిర్మాత, టార్క్ స్టూడియోస్, నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు లీగల్ నోటీసు పంపింది.
‘చంద్రముఖి’ చిత్రం ఆడియో, వీడియో హక్కులు తమకు ఉన్నాయని AP ఇంటర్నేషనల్ చెబుతోంది. “డాక్యుమెంటరీ నిర్మాతలు అనుమతి లేకుండా సినిమాలోని కొన్ని సన్నివేశాలు, పాటలను డాక్యుమెంటరీలో ఉపయోగించారు. దీనితో పాటు ఈ ఫుటేజ్‌లను యూట్యూబ్ నుండి తీసుకొని డాక్యుమెంటరీలో చేర్చారు. ఇది కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే. కంపెనీ ఇప్పటికే నిర్మాతలకు లీగల్ నోటీసు పంపింది. తమ సినిమా ఫుటేజీని ఉపయోగించినందుకు రూ.5 కోట్ల పరిహారం కూడా డిమాండ్ చేసింది” అని AP ఇంటర్నేషనల్ పేర్కొంది. దీనిపై ఈ వివాదంపై నయనతార ఇంకా స్పందించలేదు.