యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సయారా’. (Saiyaara) ఈ మూవీతో అహాన్ పాండేని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీలో అనీత్ పడ్డా హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీకి సంబంధించిన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. తాజాగా సయారా ట్రైలర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మోహిత్ సూరి మాట్లాడుతూ.. “అహాన్ పాండే, అనీత్ పద్దా వంటి అద్భుతమైన నటులు నాకు దొరకకపోతే నేను సయారా సినిమా చేసేవాడిని కాదు.
ఒకానొక సమయంలో డెబ్యూ ఆర్టిస్టుల్లో అద్భుతమైన టాలెంట్ కనిపించలేదు.. అలా కొత్త వారు ఎవ్వరూ కనిపించకపోతే ఈ మూవీని చేయకూడదని అనుకున్నాను. కానీ నాకు అహాన్, అనీత్ వంటి గొప్ప ఆర్టిస్టులు దొరికారు. ఈ ఇద్దరూ అద్భుతంగా చేశారు. కొత్తవారితో ప్రేమకథను (love story someone new) రూపొందించడం చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. నేను ఈ కథను రూపొందించాలనుకున్న విధంగానే చేశాను. నాకు ఈ ఇద్దరూ దొరకడం ఆనందంగా ఉంది”అని అన్నారు. సయారా సినిమా జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.