Sunday, August 24, 2025

‘పోలీస్ వారి హెచ్చరిక’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన ‘పోలీస్ వారి హెచ్చరి క’ (Police vaari hechcharika) ట్రైలర్‌ను సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ వేడుకలో నిర్మాత బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ… “నేను జీవితంలో ముగ్గురు నమ్ముకున్నాను. తల్లిదండ్రులను, భారతదేశాన్ని అలాగే ఇప్పుడు కళామతల్లిని. నేడు నన్ను కళామతల్లి నిలబెడుతుంది అని నమ్ముతున్నాను. జూలై 18వ తేదీన మా సినిమాను అందరూ చూసి మంచి విజయాన్ని(Good luck) అందిస్తారని కోరుకుంటున్నాను”అని అన్నారు. దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ… “సినిమాల కోసం పనిచేసేవారు తాము చేసిన సినిమా విడుదలైన ప్రతిసారి పుడుతూనే ఉంటారు. సినిమా కోసమే పుట్టామని భావిస్తాము. అందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎల్ దామోదర్ ప్రసాద్, సముద్ర, శుభలేఖ సుధాకర్, ఇంద్రజ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News