Wednesday, July 9, 2025

చెరువులో ఉన్నా.. ఒవైసి ఫాతిమా కాలేజీని కూల్చలేం: హైడ్రా స్పష్టం

- Advertisement -
- Advertisement -

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసికి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా వెనకడుగు వేసింది. హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించిన నిర్మించిన భవనాలు, అక్రమకట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫాతిమా కాలేజీ బండ్లగూడ చెరువును ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా.. ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ నడుస్తోందని..ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తి అయి.. మళ్లీ ప్రారంభమవుతున్న ఈ కాలేజీపై చర్యలు తీసుకోకపోవడంతో హైడ్రా తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో హైడ్రా స్పందిస్తూ.. ఫాతిమా కాలేజీ కూల్చకపోడానికి గల కారణాన్ని వివరించింది.

ఒవైసీ ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారు.. FTLలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లో తొలగిస్తామన్నాం.. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోంది.. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు.. అందులో 10 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం  అని హైడ్రా చెప్పుకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News