Wednesday, July 9, 2025

కుప్పకూలిన వంతెన.. నదిలో పడిపోయిన వాహనాలు

- Advertisement -
- Advertisement -

వడోదర: గుజరాత్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న 45 ఏళ్ల గంభీర వంతెన కూలిపోయింది. బుధవారం (జూలై 9) ఉదయం 7.30 గంటల సమయంలో వంతెనలోని ఒక భాగం కుప్పకూలడంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పద్రా పోలీసు ఇన్‌స్పెక్టర్ విజయ్ చరణ్ తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు దాదాపు 10 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నదిలో చిక్కుకున్న మరికొంత మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పద్రాను ఆనంద్ జిల్లాకు అనుసంధానించిన ఈ వంతెన చాలా కాలంగా శిథిలావస్థలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News